
ఎవరైనా ఉన్నారా
ఎవరైనా ఉన్నారా - ఎచ్చటైన ఉన్నారా ఈలాంటి స్నేహితుడు యేసయ్యా లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్పస్నేహితుడు హేతువేమిలేకుండా లాభమేమి పొందకుండా ప్రేమచూపు వారులేరు లోకమందునా నేనుకోరుకోకుండా నాకోసము తనకుతాను చేసినాడు సిలువయాగము అంతస్థులు లేకున్నా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా నీచుడనని చూడకుండా నాకోసము మహిమనంత వీడినాడు ఏమిచిత్రము స్వార్ధమేనమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందున ఏమి దాచుకోకుండా నాకోసమే ఉన్నదంత ఇచ్చినాడు ఏమి త్యాగమో


Follow Us