LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఏ గుంపులో నున్నావో


ఏ గుంపులో నున్నావో
ఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో (2)
జాగు చేయక వేగ మేలుకో (2)       ||ఏ గుంపులో||

మరణమనెడి మొదటి గుంపు
మారని గుంపు – నిర్జీవపు గుంపు (2)
దురాత్మ బలముతో తిరిగెడి గుంపు (2)       ||ఏ గుంపులో||

మెచ్చుఁకొనుట కిచ్చకంబు
లాడెడి గుంపు – నులివెచ్చని గుంపు (2)
చచ్చియుండిన సమాధుల గుంపు (2)       ||ఏ గుంపులో||

కరుణ లేక కఠినమైన
కరుగని గుంపు – గుర్తెరుగని గుంపు (2)
కరకు కల్గిన కఠోరపు గుంపు (2)       ||ఏ గుంపులో||

యేసు వాక్యమనగ నేమో
ఎరుగని గుంపు – విననియ్యని గుంపు (2)
ముద్ర వేసిన మూర్ఖుల గుంపు (2)       ||ఏ గుంపులో||

ధరణి నరుల తరిమి కొట్టు
దయ్యపు గుంపు – అదే కయ్యపు గుంపు (2)
పరమ తండ్రిని ఎదిరించెడి గుంపు (2)       ||ఏ గుంపులో||

పరమ తండ్రి కడకు జేర
పరుగులెత్తెడి – నిరపరాధ జనులకు (2)
కావలి కాయు కఠినాత్ముల గుంపు (2)       ||ఏ గుంపులో||

సర్వ లోక మోసగాడు
ఆది సర్పము – అదే ఘట సర్పము (2)
సర్వ భక్తుల బరి మార్చెడి గుంపు (2)       ||ఏ గుంపులో||

వధువు మంద మేయు మర్మ
మనగ గమనిక – గమనించి తెలుసుకో (2)
గదిలో చేరుకో పదిలపర్చుకో (2)       ||ఏ గుంపులో||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words