
ఏడు దీప స్తంభముల మధ్య
ఏడు దీప స్తంభముల మధ్య - సంచరించెడి నా యేసయ్యా ఆత్మ దీపమును వెలిగించి - ప్రకాశింప చేయువాడా మనోహరమైన వెలుగును చూపితివి నా నీతి సూర్యుడా - నా ఆత్మ దీపమా నీ నీతి కిరణాలే - నా త్రోవకు వెలుగై నడిపించుచున్నవిగా నీ దరి చేరేందుకు ఆరోగ్యకరమైన నీ రెక్కల క్రింద నే దాగి జీవించెదా కృతజ్ఞుడనై నీ పాద సన్నిధిలో నీ కొరకే బ్రతికెదా ఆయుష్కాలమంత పలుశ్రమలెదురైనా వెనుతిరిగి చూడక చేరెద సీయోనుకు ఇది నా నిరీక్షణా నా విశ్వాసం బలపరచె కర్తవు నీవేగా చాలునయ్య నీకృప భూమిని చీకటి కమ్ముచున్నదని నీ మందను త్వరగా నడిపించుచుంటివా కలతలు లేని కన్నీరు రాని కలవరములు లేని తేజో నివాసములో నను చేర్చుటే నిత్య సంకల్పమా నీ నిత్య సంకల్పమా


Follow Us