LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఏపాటి దాననయా


ఏపాటి దాననయా నన్నింతగ హెచ్చించుటకు
నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు (2)
నా దోషము భరియించి నా పాపము క్షమియించి
నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి (2)
ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి
కృప చూపు కృపగల దేవా – నీ కృపకు సాటి ఏది       ||ఏపాటి||

కష్టాల కడలిలో కన్నీటి లోయలలో
నా తోడు నిలిచావు నన్నాదరించావు (2)
అందరు నను విడచినా నను విడువని యేసయ్యా
విడువను యెడబాయనని నా తోడై నిలచితివా       ||ప్రేమించే||

నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా (2)
నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా
నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా       ||ప్రేమించే||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words