LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఓ క్రైస్తవుడా - సైనికుడా


ఓ క్రైస్తవుడా - సైనికుడా - బలవంతుడా - పరిశుద్ధుడా 
         కదలిరావోయ్ - నీవు కదలిరా 
         జాలరి మనుష్యుల పట్టు జాలరీ ... ఆత్మల కాయు కాపరీ 
         అమృతమంధించే ఆచారీ యేసుకై జీవించే పూజారి 

     1. సిలువే నీ స్థావరము - శ్రమలే నీ సైన్యము 
         సహనమే నీ ధైర్యము - సాక్ష్యమే నీ సైన్యము

     2. త్యాగమే నీ క్షేమము - ప్రార్థనే నీ యవ్వనము 
         వాక్యమే నీ బాణము - విశ్వాసమే ఉద్యమము 

     3. సత్యమే నీ గమ్యము - సమర్పనయే నీ శీలము 
         యేసే నీ కార్యక్రమము - ప్రేమే నీ పరాక్రమము 

     4. దేశంలో విదేశం లో - గ్రామంలో కుగ్రామంలో 
         అడవులలో కొండలలో - పనిఎంతో ఫలమెంతో 

     5. జయించి లే శరీరాన్ని - ధరించుకో శిరస్త్రాన్ని 
         బంధించు విషపు సర్పాన్ని - బోధించు యేసు పథకాన్ని 

     6. సిద్ధాంతపు గట్టు దుమికిరా - సాకులనే మెట్టులు దిగిరా 
        దీనుడా కాదు ధన్యుడా - విదేయుడా అజేయుడా 

    7. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో - అధ్వాన్నపు అడవి
        దాటి ముందుకు పో 
        నీ ఇల్లే పెనూయేలు - నీ పేరే ఇశ్రాయేలు 

    8. సంఘమే నీ రంగ స్థలం - సహవాసమే నీ స్థానము 
        ఏసే  నీ నాయకుడు - శుద్దాత్ముడే దర్శకుడు 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words