
ఓ నేస్తమా ఈ శుభవార్త
ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా నిను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా నిను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా నీవు నమ్మినవారే మోసంతో నీ గుండెనే చీల్చినా నీ స్వంత జనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చినా ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా నిను ఓదార్చే వారొకరున్నారని వాస్తవం తెలియునా నీ స్థితి మార్చువాడు యేసయ్యేననే సత్యం తెలియునా నీ కష్టార్జితము అన్యాయము చేయువారికే దక్కినా నీకున్న స్వాస్థ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా ఉద్యోగమే ఊడినా - వ్యాపారంలో ఓడినా నిను ఓదార్చే వారొకరున్నారని వాస్తవం తెలియునా నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియేనా


Follow Us