
ఓ యెరూషలేమా - దేవుని పట్టణమా
ఓ యెరూషలేమా - దేవుని పట్టణమా ఎంతటి ధన్యత నీది - నీలాంటి రాజ్యమేది సీయోను నిన్ను యెహోవా ఏర్పరచుకొనెను తనకు నివాసస్థలముగా నిన్నే కోరుకొనెను నిత్యము విశ్రమస్థానముగా ఉందునని సెలవిచ్చెను నీ భోజనమును నిండారలుగా దీవించును బీదలైన నీవారిని ఆహారముతో పోషించును నీ యాజకులకు వస్త్రముగా రక్షణ ధరింపజేయును నీ భక్తుల నోట ఆనందగానం నింపును హానిచేయు శత్రువులకు అవమానము కలిగించును చేసిన సత్యప్రమాణము తప్పకుండ నెరవేర్చును


Follow Us