
ఓ విశ్వాసి నీవు
ఓ విశ్వాసి నీవు మెలకువతో - ఉండుమా ఉండుమా కాలుజారి పోదువేమో - అదరిబెదరి పోదువేమో నీ విరోధి సాతను నీతో - యుద్ధము చేయసాగే యూదజనులతో అపవాది - యేసునేమి చేసెను సిలువవేసిరి ప్రజలంతా - తనను గేలి చేతురాయె నీ విశ్వాసము బలమైనచో - శ్రమలో ఆనందమే తల్లిదండ్రులు మరిచినను - భార్య నిన్ను ద్వేషించినా కన్నబిడ్డలు కాదనినా - ఎవరు ఏమి అన్ననూ నీ విశ్వాసము బలమైనచో - యేసులో ఆనందం బంధుమిత్రులు మరచినను - లోకము ద్వేషించినా ఎవరు నిన్ను కాదనినా యేసు నీకు తోడుండగా నీ విశ్వాసము బలమైనచో - అంతము - ఆనందం


Follow Us