
కంటి పాపను కాయు రెప్పలా
కంటి పాపను కాయు రెప్పలా నను కాచెడి యేసయ్యా చంటి పాపను సాకు అమ్మలా దాచెడి మా అయ్యా నీవేగా నీడగా తోడుగా నీతోనే నేనునూ జీవింతు నీకన్నా మిన్నగా ఎవరయ్యా నాకు నీవే చాలయ్యా ||కంటి|| మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు ఇది ఎవరూ చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి|| ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావు నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావు ఇది ఎవరూ చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి||


Follow Us