LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


కనురెప్ప పాటైన


కనురెప్ప పాటైన కను మూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ (2)
పగలూ రేయి పలకరిస్తోంది
పరమును విడిచి నను వరియించింది (2)
కలవరిస్తోంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ        ||కనురెప్ప||

ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
ప్రేమ రూపుతో నను మార్చియున్నది (2)
ప్రేమను మించిన దైవం లేదని
ప్రేమను కలిగి జీవించమని (2)
ఎదురు చూస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ        ||కనురెప్ప||

ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నది
ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది (2)
ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనే లేదని (2)
పరవశిస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ         ||కనురెప్ప||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words