LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


కన్నులకు ఆశ్చర్యం- ఈ నూతన జీవితం


 కన్నులకు ఆశ్చర్యం- ఈ నూతన జీవితం
చెర వీడే నా హృదయం - పరిశుద్ధుని రక్తములో
యేసుని నామములో - రక్షణ పొందితిని
యేసు గాయములలో - స్వస్థత పొందితిని
యేసుని నామములో - సమాధానము నేను పొందితిని

సృష్టినే పూజిస్తూ - సృష్ఠికర్తనే మరచిన
నను నూతన సృష్ఠిగా మార్చెను
యేసయ్యే నాకొరకు రాకపోతే శూన్యమే
ఉదయించే నీతిసూర్యుడై - వెలిగించే ఆత్మదీపము 

ఏ బండ నుండి చెక్కెనో - ఏ గుంటనుండి లేపినో
క్రీస్తనే బండపై నిలిపెను
శోధనలే ఎగసి వరదై పొంగి - వడిగా వచ్చినా
భయపడను ఎన్నడు దేనికి - నా ధైర్యం పరిశుద్ధాత్ముడే

ఆత్మలో వర్ధిల్లుటకు సౌఖ్యముగా వుండుట కొరకు
శరీరమునే తెరగా చీల్చెను
మర్మాల బడిలోకి - నను నడిపి నిలిపినా
పరలోక బోధకుడవు నీవు - నా క్షేమము కొరకే వచ్చావు

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words