
కన్నులతో చూసే ఈ లోకం
కన్నులతో చూసే ఈ లోకం ఎంతో – అందముగా సృష్టించబడెను భూలోకం దేవుని ఆలయముగా ఈ దేహం – పరిశుద్ధునిగా సృష్టించే శరీరం నా దేవుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగా నా యేసుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగా… ఈ దేహం అల్ఫా ఒమెగయైన మహిమకు పాత్రుడైన దేవుడు మహిమ పొందాలని ఘనత నొందాలని వేవేల దూతలతో కొనియాడబడు దేవునికి నువ్వు కావాలని తన రాజ్యం స్థాపించాలని (2) తన పోలికలో నిర్మించుకొని – ఆ హృదిలో ఉండాలని (2) నా దేవుడే కోరెనుగా – నీ హృదయాన్ని తనకీయవా ||కన్నులతో|| నీటిబుడగ వంటిదేగా ఈ జీవితం ఆవిరైపోవును ఇది మన్నైపోవును అల్ప కాలమేగా ఈ లోకము పాడైపోవును ఇది లయమైపోవును (2) ఈ సృష్టిని దేవునిగా నీవు సృష్టిని పూజించావు సృష్టికర్త దేవుడినే మరచి అంధుడవై బ్రతికావు ఆ యేసయ్య నీ కోసమై నీ శాపాన్ని భరియించెను నిత్య జీవము నీకిచ్చుటకై సిలువలో చేతులే చాచి నిను పిలచెను ||కన్నులతో||


Follow Us