
కమ్మని బహుకమ్మని
కమ్మని బహుకమ్మని – చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని – యేసు నీ ప్రేమామృతం (2) జుంటె తేనె కన్న మధురం – సర్వ జనులకు సుకృతం (2) యేసు నీ ప్రేమామృతం (2) ||కమ్మని|| ఆశ చూపెను ఈ లోకం – మలినమాయెను నా జీవితం యేసూ నీదు ప్రేమ – దయ చూపెను ఈ దీనురాలి పైన (2) వెలిగెను నాలో నీ ఆత్మ దీపము (2) కడిగిన ముత్యముగా అయ్యాను నేను (2) ||కమ్మని|| నా కురులతో పరిమళమ్ములతో – చేసెద నీదు పాద సేవ నా గుండె గుడిలో కొలువైయున్న – నీకు చేసెద నేను మధుర సేవ (2) ఆరాధింతును నిన్ను అనుదినము (2) జీవింతును నీకై అనుక్షణము (2) ||కమ్మని||


Follow Us