LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


కలనైన అనుకోలేదు


కలనైన అనుకోలేదు - నాకింత భాగ్యమనీ
శ్రీమంతుడైన యేసయ్యా - నన్నింత ప్రేమిస్తాడని

ఆ జాలికన్నులతో చూచి - ప్రేమించే చేతులనూ చాచి
చల్లని స్వరముతో నను పిలచే
అంతటి స్వామికి నాపైన - ఇంతటి దయ ఏలననుకొంటి
తడబడే అడుగులతో చేరితిని - యేసయ్యా పాదాలను

చల్లని చిరుజల్లు వలె ప్రేమ - మోడునైన నను తాకిన వేళ
ఆ ప్రేమలో చిగురించితినే
ఆ ప్రేమకు ప్రతిరూపం నాలో - ఆత్మ ఫలములెన్నో ఫలించెనే
నా ప్రియుడు తన చాటున దాచి - అనుక్షణము కాపాడెను నన్ను

ఉన్నత ఉపదేశము బోధించి - పరిమళ క్రియలను చూపించి
నాలోన ఆశను కలిగించే
నా ప్రియుని కిష్టమని తలచి - తలవంచి ఆజ్ఞను గైకొంటి
పెను తుఫానెలెన్నో ఎదురైన - బలపరచె నా ప్రక్కన నిలిచి

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words