
కలువరిలో కరిగిపోతివయ్యా
కలువరిలో కరిగిపోతివయ్యా - నా కొరకే నలిగిపోతివయ్యా నా ప్రాణనాధా -నా యేసురాజా నా ప్రాణనాధా - నా జీవనాధా నా చెడ్డ తలంపుల కొరకే - నీ తలపై ముల్ల కిరీటముంచిరి అయ్యయ్యో ఎట్లా భరించావో - అయ్యయ్యో ఎట్లా అల్లాడావో నా సిగ్గులేని పనుల కొరకే - నీ ముఖము పై ఉమ్ములు వేసిరి అయ్యయ్యో ఎట్లా భరించావో - అయ్యయ్యో ఎట్లా అల్లాడావో నా చేతులతో చేసిన పాపానికి - నీ చేతులపై మేకులు కొట్టిరి అయ్యయ్యో ఎట్లా భరించావో - అయ్యయ్యో ఎట్లా అల్లాడావో నా పాప రోగముల కొరకే - నీ దేహము కొరడాలతో చీల్చిరి అయ్యయ్యో ఎట్లా భరించావో - అయ్యయ్యో ఎట్లా అల్లాడావో


Follow Us