LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


కాలం మారినా మనుష్యులే మారినా


కాలం మారినా మనుష్యులే మారినా
నా యేసుప్రేమా మారునా
మారదూ.. మారనేమారదూ

వధకు తేబడిన గొర్రెవలె - భువికి దిగివచ్చె ప్రేమ
క్రూరమైన తోడేళ్ళమధ్యలో - నోరు తెరువలేదే ప్రేమ
వధించబడుచున్న నను విడువక - రక్తము క్రయధనముగ నిచ్చి
నను విడిపించెను ప్రేమా - మారని యేసు ప్రేమ

దిక్కులేని వానినిగ నన్ను - విడువలేదుగా ప్రేమ
ఆదరణకర్తను పంపి - సేదదీర్చైనే ప్రేమ
అగాధ సముద్ర జలములైనను - ఆర్పజాలని ప్రేమ ఇది
నను బలపరచెను ప్రేమ - మారని యేసు ప్రేమ

అవసరానికి వాడుకొని - త్రోసివేసే మనుష్యుల ప్రేమ
లోక ప్రేమనే చదరంగంలో - మిగిలిపోతినే ఒంటరిగా
కాలమనే రధచక్రముల క్రింద - నలిగిపోతున్న వేళ
నన్నాదుకొనెను ప్రేమ - మారని యేసుప్రేమ

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words