
మదిలోన నీ రూపం - నీ నిత్యసంకల్పం
మదిలోన నీ రూపం - నీ నిత్యసంకల్పం ప్రతిఫలింప జేయునే ఎన్నడూ (2) కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము వర్ణించలేను స్వామీ - నీ గొప్పకార్యాలను నీ సాటి లేరు ఇలలో - అద్వితీయుడా ప్రతీ గెలుపు బాటలోన చైతన్యస్పూర్తి నీవై - నడిపించుచున్న నేర్పరీ అలుపెరుగని పోరాటాలే - ఊహించని ఉప్పెనలై నను నిలువనీయ్యని వేళలో హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలుదైవమా జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యాతికై తడికన్నులనే తుడిచిన నేస్తం - ఇలలో నీవే కదా! యేసయ్యా నిరంతరం నీ సన్నిధిలో - నీ అడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగెదా నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై ఆశయాలదిగా నడిపెనే నీ నిత్య ఆదరణేఅన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంతాతీర్చి నాసేద తీర్చితివి నీ ఆత్మతో ముద్రించితివి నీ కొరకు సాక్షిగా! యేసయ్యా విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ్యనిర్మాతవు స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము శుద్ధులైన వారికి ఫలములిచ్చునిర్ణేతవు - ఆ గడియవరకు విడువకూ నేవేచియున్నాను నీ రాక కోసమే శ్రేష్టమైన స్వాస్థ్యముకోసం సిద్ధపరచుమా నా ఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా! యేసయ్యా


Follow Us