
మేలు చేయక నీవు ఉండలేవయ్య
మేలు చేయక నీవు ఉండలేవయ్య - ఆరాధించక నేను ఉండలేనయ్య యేసయ్యా . యేసయ్యా .. యేసయ్యా ...యేసయ్యా (2) 1. నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తిర్చేవాడా (2) క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యతనాది ||యేసయ్యా|| 2. ఆరాధించే వేళలందు - నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాతాపం కలిగే నాలో - నేను పాపినని గ్రహించగానే (2) నీ మెళ్ళకు అలవాటయ్యే - నీపాదముల్ వదలకుంటిన్ (2) నీ కిష్టమైన దారి - కనుగొంటిన్ నీతో చేరి ||యేసయ్యా|| 3. పాపములు చేసాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను క్షమింయిచగల్గె నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో (2) నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని (2) అతిశయించెద నిత్యమూ - నిన్నే కలిగున్నందుకు (2) ||యేసయ్యా||


Follow Us