
కృప వెంబడి కృపతో
కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా నను ప్రేమించిన నా యేసయ్యా (2) నను కరుణించిన నా యేసయ్యా (2) ||కృప|| నా యెడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా (2) అవి వర్ణించలేను నా యేసయ్యా అవి వివరింపలేను నా యేసయ్యా (2) నా యెడల నీకున్న వాంఛలన్నియు ||కృప|| ఎన్నో దినములు నిన్ను నే విడచితిని ఎన్నో దినములు నిన్ను నే మరచితిని (2) విడువని ఎడబాయని నా యేసయ్యా మరువక ప్రేమించిన నా యేసయ్యా (2) ఏమిచ్చి నీ ఋణము తీర్చెదనయ్యా ||కృప||


Follow Us