
కృపా సత్య సంపూర్ణుడా - ప్రేమలో
కృపా సత్య సంపూర్ణుడా - ప్రేమలో పరిపూర్ణుడా శ్రమలలో సంపూర్ణుడా - పరిశుద్ధతలో పరిపూర్ణుడా దాసుని స్వరూపమును ధరించి నీవు - చూపితివే విధేయతను నీ కాడి నెత్తుకొని నేర్చుకొందునయ్యా - సంపూర్ణ విదేయతను గర్వాంధుల నణచి - దీనులకు కృప చూపె- కనికరస్వరూపుడవు ఈ లోకమునందు నాకెంతో ధన్యత నిను సంపాదించుకొంటినే వెండి బంగారములు ఉన్నవారి కంటే నా భాగ్యము ఎంత గొప్పది ఆజ్ఞల మార్గములో నా తోడుగ నిలిచి ఇంతగనను హెచ్చించితివి బలురక్కసి చెట్లలో వల్లిపద్మముల ప్రియతమ నీ కొరకు నిలిచెదా వడగాల్పులలో - నే వాడిపోక - నీ చాటున దాగి ఉండేదా నీ పాదపూజకే - ప్రతిరోజు పూయుచు - నీ కొరకే పరిమళించెదా


Follow Us