LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


కృపానిధి నీవే ప్రభు


కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు - 2
నీ కృపలో నన్ను నిలుపుము - 2
నీ కృపతోనే నను నింపుము  -2 ౹౹కృపా౹౹

నీ కృప ఎంతో మహోన్నతము
ఆకాశము కంటే ఎత్తైయినది - 2
నీ సత్యం అత్యున్నతము
మేఘములంత ఎత్తున్నది - 2 ౹౹కృపా౹౹

నీ కృప జీవముకంటే ఉత్తమము
నీ కృప లేనిదే బ్రతుకలెను - 2
నీ కృపా బాహుళ్యంమే నను
నీలో నివసింప చేసినది  - 2౹౹కృపా౹౹

నీ కృపలను నిత్యము తలచి
నీ సత్యములో జీవింతును -2
నీ కృపాతిశయములనే
నిత్యము నేను కీర్తింతును  -2 ౹౹కృపా౹౹

ఈ లోకము ఆశాశ్వతము
నీదు కృపయే నిరంతరము  -2
లోకమంతా దూషించినా
నీ కృప నాకంటే చాలు  -2. ...౹౹కృపా౹౹

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words