
కోకొల్లలుగా ఉన్నారు కోట్లాది జనులు
కోకొల్లలుగా ఉన్నారు కోట్లాది జనులు యేసయ్య వేధనతో రోధనతో దు:ఖముతో బాధలతో అపవాది చేతిలో ఎందరో చిక్కారు త్రాగుడికి వ్యభిచారానికి బానిసలయ్యారు చేతులెత్తి మ్రొక్కుచూ.. నీకే మొర పెడుచున్నాను వారిని విడిపించే దేవాతి దేవుడు నీవయ్యా కాపరిలేని గొళ్లెలవోలె ఎందరో ఉన్నారు కాలుజారే స్థలములలో లక్షలకొలదిగ ఉన్నారు ఎవరికి మ్రొక్కిన వ్యర్థమే.. నీకే మొరపెడుచున్నాను వారిని కాపాడే కరుణామయుడవు నీవయ్యా ఎవరికి వారే వచ్చిన దేశం మరచిపోయారు ఒకరికి ఒకరు తెలియకుండ నరకములో పడుచున్నారు 2 ఎలుగెత్తి నేను ఏడ్చుచూ.. నీకే మొరపెడుచున్నాను వారిని రక్షించే కృపామయుడవు నీవయ్యా


Follow Us