LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


క్షమియించుము


క్షమియించుము ఓ ప్రభువా - పడిపోతిని నినువీడి
నా హృదయమును కడిగి - పవిత్రుని చేయు ప్రభు

నీ సన్నిధినేవదలి - అపవాదికి లోనైతి
తెగిపోయిన పటమువలె - పయనించితి శూన్యములో

నిను వీడిన నామనసు - వేసారెను వేదనతో
చిగురించని మోడువలె - వాడెను నా జీవితము

ఆకల్వరి రక్తములో - నన్ను శుద్ధుని చేయుమయా
కలుషములను ఎడబాపి - నిలుపుము నీ మార్గమున

నశియించిన నా ఆత్మన్ - రక్షించుము ఓ దేవా
శుద్ధాత్మను నా కొసగి - నడుపుము నీ సత్యముతో

నను దీక్షతో ప్రేమించి - నా కొరకై మరణించి
నా పాపము హరియించె - నా భారము తొలగించే

నేనున్నది ప్రభులోనే - నా ప్రాణము ప్రభుకొరకే
నా కాపరి యేసేలే - నాకే కొదువను లేదు

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words