
ఘనమైన నా యేసయ్యా
ఘనమైన నా యేసయ్యా బహు ఆశ్చర్యములు నీ ఘనకార్యములు నా శిరము వంచి స్తుతియింతును నీ కృపాసత్యములను ప్రకటింతును ఏమని వర్ణించెదను నీ ప్రేమను నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు నీ చేతి పనులే కనిపించే ఈ సృష్ఠి సౌందర్భము నీ ఉన్నతమైన ఉద్ధేశ్యమే మంటి నుండి నరుని నిర్మాణము ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా తరతరములుగా మనుష్యులను పోషించుచున్నావయ్యా మహాన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము నీ శాశ్వత ప్రేమ సమర్థణయే కలువరి సిలువలో బలియాగము మార్గము సత్యము జీవము నీవై - నడిపించుచున్నావయ్యా మానవ జాతికి రక్షణ మార్గము చూపించున్నావయ్యా నీ సంఘక్షేమముకై సంచకరువుగా పరిశుద్ధాత్ముని ఆగమనము నీ అద్భుతమైన కార్యములే నీవు ఇచ్చినా కృపావరములు పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశక్రమమును ఇచ్చావయ్యా స్వాస్యమైన జనులకు మహిమనగరము నిర్మించుచున్నావయ్యా


Follow Us