
ఘనుడా ఘనమైనవాడ
ఘనుడా ఘనమైనవాడ ఘనపరచువారిని గమనించువాడా గమ్యము తెలియని గమనములో గతించువారిని గమనించువాడా గమనించే నీవు మార్గము చూపి గతించకుండ నడిపించెదవు దిక్కేలేని ప్రజలను మక్కువ చూపి పిలచినావు పిలిచిన నీవు హత్తుకొంటివి ఆవేదనలో - ఓదార్చితివి ఎన్నికలేని నన్ను నీవు గుర్తించుకొని లెక్కించినావు లెక్కించే నన్ను బలమైన సేవకు ఆత్మబలముతో నింపుచుంటివి పరిపూర్ణమైన సియోనుకై శ్రమించువారిని గమనించువాడా సీయోను రాజా నీ సన్నిధిలో బహుమానమును నాకిచ్చెదవు


Follow Us