
చూచుచున్న దేవుడవయ్యా
చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచావయ్యా 1. శారాయి మాటలే విన్నాను అబ్రాహాము భార్యనైపోయాను ఈ అరణ్యదారిలో ఒంటరినై దిక్కులేక తిరుగుచున్న హాగరును నేను హగరును 2. ఇష్మాయేలుకు తల్లినైతిని అయిన వారితో త్రోసివేయబడితిని కన్నకొడుక మరణమును చూడలేక తల్లడిల్లిపోతున్న తల్లిని అనాధతల్లిని 3. పసివాడి మొరను ఆలకించావు జీవజలము నిచ్చిబ్రతికించావు నీ సంతతిని దీవింతునని వాగ్దానమిచ్చిన దేవుడవు గొప్పదేవుడవు


Follow Us