
చూచుచున్న దేవుడవు
చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము (2) పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో (2) ఆప్యాయతకు నోచుకొనని నను చేరదీసిన కృపా సాగరా (2) ||చూచుచున్న|| అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా (2) అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయా సాగరా (2) ||చూచుచున్న||


Follow Us