
జయ జయ యేసు
జయ జయ యేసు – జయ యేసు జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2) జయ జయ రాజా – జయ రాజా (2) జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం || జయ జయ || మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు (2) పరమ బలమోసగు జయ యేసు (2) శరణము నీవే జయ యేసు || జయ జయ || సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు (2) సమరము గెల్చిన జయ యేసు (2) అమరముర్తివి జయ యేసు || జయ జయ || సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు (2) పాతవి గతియించే జయ యేసు (2) దాతవు నీవే జయ యేసు || జయ జయ || బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు (2) బండలు తీయుము జయ యేసు (2) అండకు చేర్చుము జయ యేసు || జయ జయ || ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు (2) ముద్రలు తీయుము జయ యేసు (2) ముద్రించుము నను జయ యేసు || జయ జయ || కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు (2) సేవలో బలము జయ యేసు (2) జీవము నీవే జయ యేసు || జయ జయ || దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు (2) కయ్యము గెల్చిన జయ యేసు (2) అయ్యా నీవే జయ యేసు || జయ జయ ||


Follow Us