
జయమే నా ఊపిరి
జయమే నా ఊపిరి - జయజీవితమే నా గురి హోసన్నా పాడెదను - యేసుతో సాగెదను హోసన్నా స్తుతి జయధ్వనులతో ప్రాకారములనే కూల్చెదను ఆరాధన స్తుతి ఆరాధన - ఆరాధన స్తుతి ఆరాధన శత్రుసైన్యము నను తరుముచుండగా ఆశ్రయపురమై యేసు నన్ను దాచెను కృపాక్షేమములే అనుదినము అనుభవించుచు ముందుకు సాగిపోదుము జీవాహారం నాకు బలమిచ్చెను - జీవజలములు నాకు దప్పిక తీర్చెను జీవాధిపతియైన యేసు - అనుక్షణము నన్ను కాయుచుండెను తండ్రిప్రేమ నాకు నిండార ఉండగా యేసు క్రీస్తుకృప నాకు అండ నిలువగా పరిశుద్ధాత్ముడే సారధిగా - నాలో నిలిచి నన్ను నడుపుచుండగా


Follow Us