
జీవజల నది
జీవజల నది - ప్రవహించుచున్నది. జాగేల సోదర - నీ ఆత్మీయదాహం తీర్చుకొమ్ము నేడే క్రీస్తనే బండ చీల్చబడెన్ - అదిగో కల్వరిలో ప్రతి మనుష్యుని - జీవింపజేయున్ - ప్రవహించుచుండె జలం సీనాయి అరణ్యమందున - చీల్చబడె బండ దేవుని ప్రజలైన - ఇశ్రాయేలున్ దీర్చుకొనె సేదన్ పాపాత్మురాలై సమరయ స్త్రీ - దీర్చుకొనె దాహం ప్రభుని వేడె జలమునకై - పొందె నిత్యజీవం సర్వమానవ రక్షణకై - నీయబడినది ప్రతివాని నుండి జీవజల ఊటల్- ఉబికింపచేయునని


Follow Us