
జీవన తొలి సంధ్య
జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం నా జీవన మలి సంధ్య నీతోనే అంతము (2) నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది (2) నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు (2) ||జీవన|| నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు (2) నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను (2) దేవా నీవే నా ఆశ్రయ దుర్గము (2) ||జీవన|| నా పూర్వికులందరు ఎప్పుడో గతించారు ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను (2) నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా నా వేష భాషయులన్నియు నీకే సమర్పింతును దేవా (2) దేవా నను నీ సాక్షిగ నిల్పుమా (2) ||జీవన||


Follow Us