
జీవము ఉన్న నా యేసయ్యా
జీవము ఉన్న నా యేసయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా జీవము లేని వాటికి ఎందరో మ్రొక్కుచు జీవమున్నదని వారు భ్రమ పడుచున్నారు మనుషులు చేసిన ప్రతిమాలన్నీ ఆరాధనకు యోగ్యమైనవి కానే కావయ్యా మనుషులను చేసినది నీవే యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యూ జగతికి పునాది వేయకముందే క్రీస్తులో నన్ను నీవు ఎన్నుకున్నావు ఇంత విలువ ఉన్నదని నాకు తెలియదే నిన్ను నమ్ముకున్నాకే తెలుసుకున్నాను ఈపామరుడే పాటలుపాడగా దూతలతో నీవు సంతోషిస్తావు నాలో ఊపిరి ఉన్నంతకాలము యేసయ్యా నిన్ను గూర్చి పాడకుండ ఉండలేనయ్యా


Follow Us