
జీవము నిచ్చిన
జీవము నిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధనా రక్తము చిందించి రక్షించిన యేసుక్రీస్తు ఆరాధనా బలపరచు నను స్థిరపరచు పరిశుద్ధాత్మ ఆరాధనా ఆరాధన - ఆరాధన - ఆరాధన - ఆరాధన నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగము జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా హల్లెలూయ హల్లెలూయ జీవమునొసగు వాక్కులచే అనుదినము నను పోషించు నీదు బాటలో పయనింప దారిని నాకు చూపించు చాలును నాకు నీ కృప నిత్యము నేను జీవించెద జీవించిన మరణించినా ఇకనీకోసమే యేసయ్యా హల్లెలూయ హల్లెలూయ


Follow Us