
అనుక్షణము నిన్నే ఆరాధించుచూ
అనుక్షణము నిన్నే ఆరాధించుచూ స్తోత్రించెద యేసయ్యా విశ్వాసమునకు కర్తవై కొనసాగించే యేసయ్యా ఈ ఆత్మీయ యాత్రలో నను వెను తిరిగి చూడనీయక సింహాసనమే నా గురిగా సిద్ధపరచు ఆత్మదేవ మార్గమే తెలియక త్రోవ తప్పియున్న నాకై తేజోమయుడవై మార్గములో నిలిచితివి నేనే మార్గము సత్యము జీవమని ఉపదేశించిన సత్యవంతుడా కల్పింపబడుచున్న ప్రతి ఉపదేశమునకు అటు ఇటు తిరుగుచు వ్యర్ధుడనైయున్న నన్ను ఆది అపోస్తలుల ఉపదేశములో నను నిలిపిన నా పరిశుద్ధాత్ముడా క్రీస్తే శిరస్సైయున్న పరిశుద్ధ సంఘమునకు ప్రాణాత్మ దేహములు అర్పించుకొంటిని జీవించువాడను ఇకనే కాను క్రీస్తే నాలో జీవించుచున్నాడు


Follow Us