
జీవితంలో నీలా ఉండాలని
జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది (2) తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత (2) ||జీవితంలో|| కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో (2) నీలాగే నడవాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే నడవాలని.. యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే నడిచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని (2) ||తీరునా|| పరిశుద్ధతలో ప్రార్ధించుటలో ఊపవాసములొ ఉపదేశములో (2) నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని.. యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని (2) ||తీరునా||


Follow Us