
జీవింతు నేను ఇక
జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసుకొరకు జీవింతును - నన్ను ప్రేమించిన నా యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన ప్రభుయేసు కొరకే జీవింతును జీవింతును జీవింతును జీవింతును నీ ఉన్నత పిలుపుకు లోబడుదున్ గురివైపునకే బహుమానము పొందగ పరుగిడుదున్ వెనుక ఉన్నవన్నియు మరతున్ ముందున్న వాటికొరకే వేగిరపడుదున్ నన్ను ప్రేమించిన యేసువైపు చూచుచు నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును గురివైపుకే పరుగిడుదును వెనుదిరుగను వెనుదిరుగను సిలువ వేయబడితిని క్రీస్తుతో - ఇకనాలో యేసే జీవించుచున్నాడు సజీవయాగమై నిలతును - ధరక్రీస్తుకు సాక్షినై జీవింతును నన్ను ప్రేమించిన నా యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన ప్రియయేసు కొరకే జీవింతును జీవింతును జీవింతును


Follow Us