LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


జుంటి తేనె ధారల కన్నా


జుంటి తేనె ధారల కన్నా
యేసు నామమే మధురం
యేసయ్య సన్నిధినే మరువజాలను (2)
జీవితకాలమంతా ఆనందించెదా
యేసయ్యనే ఆరాధించెదా (2)          ||జుంటి తేనె||

యేసయ్య నామమే బహు పూజనీయము
నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2)
నన్నెంతగానో దీవించి
జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2)      ||జుంటి తేనె||

యేసయ్య నామమే బలమైన దుర్గము
నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2)
నన్నెంతగానో కరుణించి
పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2)         ||జుంటి తేనె||

యేసయ్య నామమే పరిమళ తైలము
నాలో నివసించే సువాసనగా నను మార్చి (2)
నన్నెంతగానో ప్రేమించి
విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే (2)         ||జుంటి తేనె||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words