
అనుదినం ఆ ప్రభుని వరమే
నా కోరిక నీ ప్రణాలికా -పరిమలించాలనీ నా ప్రార్థనా విజ్ఞాపనా - నిత్యమహిమలో నిలవాలనీ (2) అక్ష్యాయుడా నీ కల్వరిత్యాగం - అంకితభావం కలుగజేసెను ఆశలవాకిలి తెరచినావు - అనురాగవర్షం కురిపించినావు (2) నా హృదయములో ఉప్పొంగెనే - కృతజ్ఞతా సంద్రమే నీ సన్నిధిలో స్తుతి పాడనా - నాహృధయ విద్వాంసుడా (2) యధార్ధవంతుల యెడల - నీవు ఏడబాయక కృప చూపి గాఢాంధకారము కమ్ముకొనగా - వెలుగు రేఖవై ఉదయించినావు (2) నన్ను నీవు విడిపించినావు - ఇష్టుడనై నే నడచినందున దీర్ఘాయువుతో తృప్తిపరచిన - సజీవుడవు నీవేనయ్య నాలో ఉన్నది విశ్వాసవరము - తోడై ఉన్నది వాగ్దాన ఫలము ధైర్యపరచి నడుపుచున్నది - విజయ శిఖరపు దిశగా (2) ఆర్పజాలని నీ ప్రేమతో - ఆత్మదీపము వెలిగించినావు దీనమనస్సు వినయభావము - నాకు నేర్పిన సాత్వీకుడా స్వచ్ఛమైనది నీ వాక్యం - వన్నె తరగని ఉపదేశం మహిమకలిగిన సంఘముగా - నన్ను నిలుపునే నీ యెదుట (2) సిగ్గుపరచదు నన్నెన్నడూ - నీలో నాకున్న నిరీక్షణ వేచియున్నాను నీ కోసమే - సిద్ధపరచుము సంపుర్ణుడా


Follow Us