
తూర్పు దిక్కు చుక్క బుట్టె
తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మా – ఓ మరియమ్మా (2) చుక్కను జూచి మేము వచ్చినాము మొక్కి పోవుటకు (2) ||తూర్పు దిక్కు|| బెత్లెహేము పురము లోని బాలుడమ్మా గొప్ప బాలుడమ్మా (2) మన పాపముల బాప పుట్టెనమ్మా మహిమవంతుడమ్మా (2) ||తూర్పు దిక్కు|| పశువుల పాకలోని బాలుడమ్మా పాపరహితుడమ్మా (2) పాపంబు బాపను పుట్టెనమ్మా సత్యవంతుడమ్మా (2) ||తూర్పు దిక్కు|| బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము బాల యేసు నొద్దకు (2) బంగారు పాదముల మ్రొక్కెదము బహుగ పాడెదము (2) ||తూర్పు దిక్కు||


Follow Us