
తేజోవాసుల స్వాస్థ్యమందు
తేజోవాసుల స్వాస్థ్యమందు - నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా -2 తేజోవాసుల స్వాస్థ్యమందు ...... అగ్నిలో పుటము వేయబడగా - నాదు విశ్వాసము -2 శుద్ధ సువర్ణమగునా - నీదు రూపు రూపించబడునా -2 ॥ తేజో ॥ రాబోవు యుగములన్నిటిలో - కృపా మహదైశ్వర్యం -2 కనుపరచే నిమిత్తమేనా - నన్ను నీవు ఏర్పరచితివా -2 ॥ తేజో ॥ శాపము రోగములు లేని - శాశ్వత రాజ్యము -2 శాపవిముక్తి పొందిన - శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా -2 ॥తేజో ॥ నటనలు నరహత్యలు లేని - నూతన యెరూషలేం -2 అర్హతలేని నన్నును - చెర్చుటయే నీ చిత్తమా -2 ॥తేజో॥


Follow Us