
దయకలిగిన యేసయ్యా.. నీ
దయకలిగిన యేసయ్యా.. నీ కళ్ళలోన కరుణను చూపి కఠినమైన నా హృదయం కరిగించినావయ్యా నీ ద్వారా మేలులు పొంది నిన్ను నేను నమ్మించితిని నీవెవరో తెలిసి కూడా ఎరుగనని బొంకితినయ్యా కరుణారస భరితుడా - కోపమేమి చూపక కరుణతోనే నన్ను - నీ కౌగిట చేర్చితివి తండ్రి నీ ఇంట నుండి ఎంతో ప్రేమనుభవించి క్రమశిక్షణ తాళలేక నీకు దూరమైతినయ్యా ప్రేమాపరిపూర్ణుడా - నన్ను త్రోసివేయక ప్రేమతోనే మరలా - నీ ఇంటికి పిలిచితివి పూర్వమందు నిన్ను నేను హింసించి దూషించితిని నీవెవరో తెలియకనే నీ సంఘమును చెరిపితినయ్యా కృపా సంపూర్ణుడా - నా కన్నులు తెరిపించి కృపతోనే నన్ను - నీ సేవకు పిలిచితివి


Follow Us