LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


దయగల నీ చూపులతో


దయగల నీ చూపులతో - వెదకి రక్షించితివి
నీ సొత్తుగా చేసుకొంటివి - నీయింట చేర్చితివి
నా యేసయ్యా - ఆదరించితివి

నాలో ఏ మంచి లేకున్న ప్రేమించితివి
లేని మంచిని నాలో సృష్టించితివి
నీలోని గుణాతిశయములు
ప్రచురము చేసిదనూ
ఉత్సాహ స్తోత్రములతో సేవించుచు

కోరుకొంటివి నాలో నివసించాలని
నన్ను నిర్మించుకొంటివి నీ ఆలయముగా
అభిషేక తైలముతో నను వెలిగించి
నీ దీపవృక్షములో నను నిలిపితివి

ఈ విలువైన జీవితము నీ విచ్చనదేగా
భుజముపై సిలువ లేకుంటే విలువ లేదుగా
సిలువధారి నీవే నా బలిపీఠము
వేవేల మందిలో నిన్నే మహిమపరతునూ

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words