
దీనుడా దైవకుమారుడా
దీనుడా దైవకుమారుడా - దీనుల పాలిట కృప చూపువాడ చూపిన కృపలో క్షమించబడితిమి చూపిన కృపతో దీవించబడితిమి (2) దీనుడా నా యేసయ్యా - దీనుడా నా యేసయ్యా ఇక పై నేను నీ కంకితము (2) నూతన సంవత్సరం ధరింపజేసితివి వ్యాధి బాధల్లో బ్రతికించి లేపితివి (2) దీనుడా నా యేసయ్యా - దీనుడా మృత్యుంజేయుడా ఇక పై నేను స్తుతియించెదను (2) శాశ్వత ప్రేమతో నను ప్రేమించి ఆవేదనలో ఆదుకొంటివి (2) దీనుడా నా యేసయ్యా - దీనుడా ఐశ్వర్యవంతుడా ఇక పై నేను ఆరాధించెదను (2) మహిమతో మమ్మును పుటము వేసి నీ రూపములో చెక్కుచుంటివి (2) దీనుడా నా యేసయ్యా - దీనుడా శిల్పకారుడా ఇక పై నేను సేవించెదను (2)


Follow Us