
దుర్దినములు రాకముందే
దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2) స్మరియించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2) ||దుర్దినములు|| సాగిపోయిన నీడవంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది (2) తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారికోసం (2) పాతాళ వేదనలు తప్పించుకొనలేవు ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2) ||దుర్దినములు|| రత్నరాసులేవి నీతో కూడ రావు మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2) యేసు క్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ (2) తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2) ||దుర్దినములు||


Follow Us