
దేవర నీ దీవెనలు
దేవర నీ దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమే దిగనిమ్ము పావన యేసుని ద్వారగను (2) దంపతులు దండిగ నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై ||దేవర నీ|| ఈ కవను నీ కరుణన్ ఆకరు వరకును లోకములో శోకము లేకయే ఏకముగా బ్రాకటముగను జేకొనుము ||దేవర నీ|| ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పున దప్పకను మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ ||దేవర నీ|| తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగా గాపుగ బ్రాపుగ దాపునుండి యాపదలన్నియు బాపుచును ||దేవర నీ|| సాధులుగన్ జేయుటకై శోధనలచే నీవు శోధింపగా కదలక వదలక ముదమున నీ పాదము దాపున బాదుకొనన్ ||దేవర నీ|| మెండుగ భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగ దండిగ నండనుండి వెండియు వానిని ఖండించావే ||దేవర నీ|| యిద్దరు వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ ||దేవర నీ|| వాసిగ నీ దాసులము చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని మా సకలేశ్వర నీ సుతుడ యేసుని పేరిట బ్రోవుమామేన్ ||దేవర నీ||


Follow Us