
దేవా కనబడుము
దేవా కనబడుము - ఓ దేవా మాట్లాడుమా- ధరణిలో మాకు దర్శన మొసగి - ధన్యులు చేయుము మా దేవదేవుడా హృదయ, శుద్ధి కలవారు - ధన్యులు ధరణిలో వారు దేవుని చూతురు- దేదీప్యంబుగ పరిశుద్ధత లేకున్న - ప్రభుని చూడలేరు - పరిశుద్దుడవై సన్నిధి చేరుము. వంకరబుద్ది విడచి - తిన్నని మనస్సు కలిగి - కడుదీనుడవై సన్నిధి చేరుము అబ్రాహాముతో దేవా ముఖాముఖిగ దేవా - కనబడి మాట్లాడిన ఓ దేవా దైవ త్రియేక దేవా తండ్రికుమార శుద్ధాత్మ- తగుస్తుతు లొందుము త్రియేకుండా


Follow Us