
అన్ని కాలంబుల – నున్న యెహోవా ని
అన్ని కాలంబుల – నున్న యెహోవా ని నెన్నదరంబయో – కన్న తండ్రి వన్నె కెక్కిన మోక్ష – వాసాళి సన్నుతు లున్నతమై యుండ – మున్నె నీకు నిన్ను బ్రకటన సేయ – నిఖిల లోకములను బన్నుగ జేసిన – బలుడ వీవె ఉన్న లోకంబుల – నుడుగక కరుణా సం పన్నతతో నేలు – ప్రభుడ వీవె అన్ని జీవుల నెరిగి – యాహార మిచ్చుచు నున్న సర్వజ్ఞుo – డవు నీవే ఎన్న శక్యముగాక – ఉన్న లక్షణముల సన్నుతించుటకు నే – జాలుదునా పుట్టింప నీవంచు – బోషింప నీవంచు గిట్టింప నీవంచు – గీర్తింతును నట్టి పనికి మాలి – నట్టి మానవుల చే పట్టి రక్షింప బా – ధ్యుండ వంచు దట్టమైన కృపను దరి జేర్చ నాకిచ్చి పట్టయు నిలచియుండు – ప్రభుడ వంచు గట్టడచే గడ – ముట్టుదనుక నా పట్టుకొలది నిన్ను – బ్రస్తుతింతు కారుణ్య నిధి వీవు – కఠినాత్ముడను నేను భూరి శుద్ధుడ వీవు – పాపి నేను సార భాగ్యుడ వీవు – జగతిలో నాకన్న దారిద్రుడే లేడు – తరచి చూడ సార సద్గుణముల – సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ సం – చారి, నేను ఏ రీతి స్తుతియింతు – నే రీతి సేవింతు నేర మెన్నక ప్రోవ – నెర నమ్మితి


Follow Us