
దేవుని సముఖ జీవ కవిలెలో
దేవుని సముఖ జీవ కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే (2) హత సాక్షుల కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన (2) విజయవీరుల కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు (2) సర్వోన్నతుని పురములలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన (2) ప్రార్ధన వీరుల కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| పరమునుండి ప్రభువు దిగగా – పరిశుద్ధులు పైకెగయునుగా (2) పరిశుద్ధుల కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||


Follow Us