
నడిపించుచున్నావా నా యేసయ్యా
నడిపించుచున్నావా నా యేసయ్యా నీ చిత్తము నేను నెరవేర్చుటకు సింహాసనము నే చేరువరకు నా చేయి విడువని సమర్థుడవు నీవు శోధన సమయములో నలిగిన రెల్లువలే కుమిలిపోతిని - ఒంటరినై నేను ఆత్మతో సాగే సంఘములో చేర్చి పిరికి ఆత్మను దూరము చేసితివి శత్రువు చెరనుండి నను విడిపించితివి నీ వాక్యముతో నను బలపరచితివి శత్రువు ఎదుట నీ నామమును మహిమపరచుచూ ఆరాధించేద శక్తి సంపన్నుడా పరాక్రమశాలి బలహీనులను బలపరచువాడా సర్వాంగ కవచముగా నిను ధరియించి సిలువకు సాక్షిగా నిలిచెద నేను


Follow Us