
నన్నెంతగా ప్రేమించితివో
నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో గలనా – నే చెప్పగలనా దాయనా – నే దాయగలనా (2) అయ్యా… నా యేసయ్యా నాదం – తాళం – రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2) ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2) ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా|| ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2) ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2) ||గలనా||


Follow Us